జింబాబ్వేను 90 పరుగులతో చిత్తు చేసిన భారత్.. శ్రేయస్‌కు కెప్టెన్‌గా తొలి సిరీస్

జింబాబ్వేను 90 పరుగులతో చిత్తు చేసిన భారత్.. శ్రేయస్‌కు కెప్టెన్‌గా తొలి సిరీస్

 IND vs ZIM: జింబాబ్వే గడ్డపై భారత్ తమ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. హరారే వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ జింబాబ్వేను చిత్తు చేసిన టీమిండియా, వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తన ఖాతాలో తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు.

బ్యాటింగ్‌లో ఇషాన్, తిలక్ ధనాధన్: 
హరారే పిచ్ బ్యాటింగ్‌కు అంత సులువుగా లేకపోయినప్పటికీ, భారత బ్యాటర్లు జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డారు.  వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ చెలరేగి ఆడుతూ మెరుపు అర్ధశతకాలు సాధించారు. వీరిద్దరి ధనాధన్ బ్యాటింగ్ పుణ్యమా అని భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 219 పరుగులు చేసింది. 

129 పరుగులకే కుప్పకూలిన జింబాబ్వే: 
220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు భారత బౌలర్ల ధాటికి ఏమాత్రం తాళలేకపోయింది. ఇండియన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. బ్యాటింగ్‌లో నిరాశపరిచిన అభిషేక్ ఈసారి బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి 3 వికెట్లు పడగొట్టి జింబాబ్వే నడుం విరిచాడు. దీంతో జింబాబ్వే జట్టు కేవలం 129 పరుగులకే కుప్పకూలింది. 

ఐర్లాండ్, ఇంగ్లాండ్ ఓటముల తర్వాత భారత్ కంబ్యాక్: 
ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లలో వరుస పరాజయాలను ఎదుర్కొన్న భారత జట్టుకు ఈ సిరీస్ విజయం ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కి తొలి సిరీస్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక ఈ పర్యటనలోని ఆఖరిదైన మూడో టీ20 మ్యాచ్ రేపు (జులై 26న, ఆదివారం) సాయంత్రం 4: 30 గంటలకి స్టార్ట్ కానుంది.