ఐక్యరాజ్యసమితి ముందు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. ఫిబ్రవరి 14న పుల్వామా దాడికి పాకిస్తాన్ దే బాధ్యత అంటూ నినాదాలు చేశారు. భారత్, కరేబియన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇజ్రాయెల్, బెలూచిస్తాన్ నుంచి వందలాది మంది ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ నిధులు సమకూరుస్తోందని నినాదాలు చేశారు. పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఆందోళనకారులు. మసూద్ అజార్ ను ఇంటర్నేషనల్ టెర్రరిస్టుగా ప్రకటించాలన్నారు. ఈ విషయాలపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కు వినతి పత్రాన్ని మెయిల్ చేశారు.
