కామన్వెల్త్‌లో భారత్ హవా.. ఒక్కరోజే 16 మెడల్స్.. 8 గోల్డ్‌లు!

కామన్వెల్త్‌లో భారత్ హవా.. ఒక్కరోజే 16 మెడల్స్.. 8 గోల్డ్‌లు!

Commonwealth Games: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగింపు దశకు (ఆగస్టు 1) చేరిన వేళ, భారత క్రీడాకారులు ఊహకందని అద్భుత సంచలనం సృష్టించారు. ఈ మెగా టోర్నీ చరిత్రలోనే ఇండియాకు అత్యంత విజయవంతమైన రోజుగా శనివారం (ఆగస్టు 1న) నిలిచిపోయింది. భారత అథ్లెట్లు ఒకే ఒక్క రోజులో ఏకంగా 16 పతకాలతో (8 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు) మెడల్స్ సునామీ సృష్టించింది. ఈ చారిత్రాత్మక విజయంతో భారత్ మొత్తం 39 పతకాలతో పతకాల టేబుల్ లో ఏకంగా 4వ స్థానానికి దూసుకెళ్లింది. 

బాక్సింగ్లో ఏకంగా 7 స్వర్ణాలు: 
10వ రోజు భారత బాక్సర్లు రింగ్‌లో ప్రత్యర్థులను ఊచకోత కోశారు. ఒకే రోజు 10 మెడల్స్ (7 గోల్డ్, 3 సిల్వర్) కొల్లగొట్టి కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే ఒకే ఎడిషన్‌లో అత్యధిక బాక్సింగ్ పతకాలు సాధించిన దేశంగా భారత్ ఆల్-టైమ్ రికార్డు సృష్టించింది. 

స్వర్ణ విజేతలు (7 Gold):
* ప్రీతి పవార్ (మహిళల 54 కేజీలు)
* జాస్మిన్ లాంబోరియా (మహిళల 57 కేజీలు)
* అరుంధతి చౌదరి (మహిళల 70 కేజీలు)
* ప్రియా ఘంగాస్ (మహిళల 60 కేజీలు)
* సాక్షి చౌదరి (మహిళల 51 కేజీలు)
* సచిన్ సివాచ్ (పురుషుల 60 కేజీలు)
* అంకుష్ పంగల్ (పురుషుల 80 కేజీలు)

రజత విజేతలు (3 Silver):
* లవ్లీనా బొర్గోహైన్ (మహిళల 75 కేజీలు)
* నరేందర్ బెర్వాల్ (పురుషుల 90+ కేజీలు)
* జాదుమణి సింగ్ (పురుషుల 55 కేజీలు)

అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్‌లో చారిత్రక రికార్డులు: 

* పారా షాట్‌పుట్ (F57): సోమన్ రానా స్వర్ణం (Gold), శుభమ్ జుయల్ రజతం (Silver) గెలుచుకుని భారత్‌కు డబుల్ పోడియం ఫినిష్ ఇచ్చారు.

* గుల్వీర్ సింగ్ ఘనత: పురుషుల 5000 మీటర్ల పరుగులో కాంస్య పతకం (Bronze) సాధించి, ఒకే కామన్వెల్త్ గేమ్స్ ఎడిషన్‌లో అథ్లెటిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు.

* ట్రిపుల్ జంప్‌లో డబుల్ ధమాకా: ప్రవీణ్ చిత్రావెల్ రజతం (Silver), సెల్వ ప్రభు తిరుమరన్ కాంస్యం (Bronze) గెలుచుకుని ఒకే వేదికపై ఇద్దరు భారతీయులు పోడియంపై నిలిచారు.

జూడోలో ఉన్నతి శర్మ కాంస్యం: 
మహిళల 63 కేజీల జూడో విభాగంలో ఉన్నతి శర్మ సెమీఫైనల్స్ వరకు దూసుకెళ్లి, అనంతరం జరిగిన పోరులో సవాలును అధిగమించి భారత్ ఖాతాలో కాంస్య పతకాన్ని (Bronze) చేర్చింది. ఒకే ఒక్క రోజులో 8 స్వర్ణాలతో సహా 16 పతకాలు సాధించిన భారత క్రీడాకారులు, కామన్వెల్త్ వేదికపై భారత్ పవర్ అండ్ పంచ్ ఏంటో ప్రపంచానికి నిరూపించారు.