కొత్తగా యుద్ధ విమానాలు కొంటున్న ప్రధాని మోదీ

కొత్తగా యుద్ధ విమానాలు కొంటున్న ప్రధాని మోదీ

భారత్.. ​ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ యుద్ధ విమానాలు,  మూడు స్కార్పెన్ క్లాస్  జలాంతర్గాములను కొనుగోలు చేయాలని చూస్తోంది.  ఈ ప్రతిపాదనలు రక్షణ మంత్రిత్వ శాఖ ముందు ఉన్నాయని, ఈ వారం ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా వీటి కొనుగోలు వివరాలు  ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు  తెలిపాయి.   ఈ ప్రపోజల్స్​ ఓకే అయితే భారత నావికాదళానికి 22 సింగిల్-సీట్ రాఫెల్ మెరైన్ విమానాలతో పాటు నాలుగు ట్రైనర్ విమానాలు అందుబాటులోకి  రానున్నాయి.   దేశ భద్రత సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ యుద్ధ విమానాలు, జలాంతర్గాములను కొనాలని  నౌకాదళం భావిస్తోంది.  విమాన వాహక నౌకలు ఐఎన్​ఎస్​ విక్రమాదిత్య,  విక్రాంత్‌లు మిగ్​29 లను నడుపుతున్నాయి.  

మొత్తంగా వీటి డీల్స్​ విలువ రూ.90,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే  కాంట్రాక్టు చేపట్టిన తరువాతే పూర్తి ఖర్చుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  భారత్ ఈ ఒప్పందంలో రాయితీలను కోరే అవకాశం ఉంది.  గతంలో 36 యుద్ధ విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లే రాఫెల్‌  డీల్‌కు సంబంధించి భారత్‌, ఫ్రాన్స్‌లు సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేసి ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.  ఈ ప్రతిపాదనలు  ఉన్నతాధికారుల దగ్గర ఉన్నాయి. మొత్తంగా అధునాతన రక్షణ విమానాలు అందుబాటులోకి వస్తే భారత్​కు అదనపు బలం చేకూరనుంది.