ఢాకా: ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీని ఇండియా మెన్స్ హాకీ జట్టు డ్రా తో స్టార్ట్ చేసింది. మంగళవారం కొరియాతో జరిగిన మ్యాచ్‌ను ఇండియా 2 –2తో డ్రా చేసుకుంది. లలిత్ ఉపాధ్యాయ్(4వ నిమిషం) హర్మన్‌ప్రీత్ సింగ్(18వ ని.) ఇండియాకు గోల్స్ అందించారు. కొరియా తరఫున జాంగ్‌యున్(41వ ని.), సుగ్యన్ కిమ్(46వ ని.) గోల్స్ చేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన తర్వాత తొలిసారి బరిలోకి దిగిన ఇండియా మ్యాచ్‌ను దూకుడుగా మొదలుపెట్టింది. ఫస్టాఫ్‌లోనే రెండు గోల్స్ కొట్టింది. సెకండాఫ్‌లో ఇండియా డిఫెన్స్‌ను దీటుగా ఎదుర్కొన్న కొరియన్లు రెండు గోల్స్ చేసి స్కోర్లు సమం చేశారు. బుధవారం జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఇండియా తలపడుతుంది.

