న్యూఢిల్లీ: వాతావరణ మార్పులకు భారత్ ఎంతమాత్రం కారణం కాదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అయితే ఉద్గారాలన తగ్గించడంలో మాత్రం బాధ్యతాయుత దేశంగా భారత్ పని చేస్తోందని తెలిపారు. 5వ పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్‌లో పాల్గొన్న ప్రకాశ్ జవదేకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వాతావరణ మార్పులనేవి రాత్రికి రాత్రే వచ్చే సమస్య కాదు. గత వందేళ్లలో ఇది ఏర్పడింది. చారిత్రాత్మకంగా చూసుకుంటే.. 25 శాతం కర్బన ఉద్గారాలకు యూఎస్ఏ కారణం. యూరప్‌లో 22 శాతం, చైనా నుంచి 13 శాతం ఉద్గారాలు వెలువడుతున్నాయి’ అని జవదేకర్ చెప్పారు. అదే సమయంలో భారత్ నుంచి కేవలం 3 శాతం ఉద్గారాలు మాత్రమే వెలువడుతున్నాయని పేర్కొన్నారు.
