భారత్‌లో కరోనా తగ్గుముఖం

భారత్‌లో కరోనా తగ్గుముఖం

భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒకప్పుడు వేలల్లో నమోదైన కేసులు ఇప్పుడు... రెండు వేలలోపే రికార్డ్ అవుతున్నాయి. దీంతో ప్రజలు కాస్త ఊరట పొందారు. గత మూడేళ్లుగా కోవిడ్ కలకలం నెలకొంది. ఎక్కడ చూసినా కరోనా కేసులు.. కరోనా మరణాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా మళ్లీ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు కోవిడ్ నిబంధనల్ని కూడా సడలించాయి. 

ఇక కరోనా కేసుల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,778 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ కారణంగా 62 మంది మరణించారు. ప్రస్తుతం భారత్‌లో 23,087 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్‌ను కూడా కొనసాగిస్తున్నారు అధికారులు. అర్హులైన వారంతా తప్పక కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని చెబుతున్నారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా  1,81,89,15,234మందికి వ్యాక్సిన్ పూర్తయ్యింది.