భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వమివ్వాలి : ఫ్రాన్స్‌

భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వమివ్వాలి : ఫ్రాన్స్‌
రెండేళ్లపాటు ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి (UNSC) తాత్కాలిక సభ్యదేశంగా భారత్‌ కొనసాగనుంది. ఈ  క్రమంలో భారత్‌కు ఫ్రాన్స్‌ స్వాగతం పలికింది. యునైటెడ్‌ నేషన్‌ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్‌తో కలిసి పనిచేయడానికి తామెంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామని, ఉగ్రవాదంపై పోరు సహా వివిధ అంశాల్లో భారత్‌తో కలిసి పనిచేసేందుకు సంతోషంగా ఉన్నామని ఫ్రాన్స్‌ తెలిపింది. దీనికి సంబంధించి భారత్‌లో ఫ్రాన్స్‌ రాయబారి ఇమాన్యుయేల్‌ లెనైన్‌ ప్రకటన చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యదేశ హోదా కల్పించాలని.. అందుకు UNSCలో సంస్కరణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.