టీమిండియా మిషన్ 444: ఓవ‌ల్‌లో అత్యధిక రన్ ఛేజ్ ఎంతో తెలుసా?

టీమిండియా మిషన్ 444: ఓవ‌ల్‌లో అత్యధిక రన్ ఛేజ్ ఎంతో తెలుసా?

ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ రసవత్తరంగా సాగుతోంది. నాలుగు రోజుల ఆట ముగిసేసరికి విజయావకాశాలు ఇరు జట్లకు సమానంగా ఉన్నాయి. విజయానికి భారత్‌ ఇంకా 280 పరుగుల దూరంలో ఉండగా.. ఆసీస్‌ మరో ఏడు వికెట్ల దూరంలో ఉంది. అందరి ఆశలు ప్రస్తుతం క్రీజులో ఉన్న విరాట్‌ కోహ్లీ(44), రహానె(20)పైనే ఉన్నాయి. చివరి రోజు మూడు సెషన్లపాటు వీరిద్దరూ కొనసాగిస్తేనే భారత్‌ విజయానికి చేరువ కాగలదు. అదే సమయంలో వికెట్లు కోల్పోకుండా ఆడడం కూడా అత్యంత కీలకం.

చేధిస్తే 120 ఏళ్ల చరిత్ర తిరగరాసినట్లే.. 

ఓవ‌ల్‌లో ఇప్పటివరకూ రికార్డు లక్ష్య ఛేద‌న 263గా ఉంది. 1902లో ఇంగ్లండ్ జట్టు.. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఈ గణాంకాల ప్ర‌కారం అయితే.. ఈ మైదానంలో ఏ జ‌ట్టు 300 ప్ల‌స్ ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేదు. మ‌రి ఆసీస్ నిర్ధేశించిన 444 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా బ్యాట‌ర్లు చేధిస్తారా అన్నది మ‌రికొన్ని గంట‌ల్లో తేలనుంది. ఒకవేళ చేధిస్తే మాత్రం ఓవల్ గడ్డపై చరిత్ర సృష్టించిన జట్టుగా టీమిండియా అవతరిస్తుంది.


ఓవ‌ల్‌లో అత్యధిక టెస్ట్ రన్ ఛేజింగ్‌లు

263/9 -  ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా, 1902
255/2 - వెస్టిండీస్ vs  ఇంగ్లండ్, 1963
242/5 - ఆస్ట్రేలియా vs  ఇంగ్లండ్, 1972
226/2 - వెస్టిండీస్ vs  ఇంగ్లండ్, 1988
205/2 -  ఇంగ్లండ్  vs సౌతాఫ్రికా, 1994

ఓవల్ వేదికపై నాలుగో ఇన్నింగ్స్ అత్యధిక స్కోర్లు

429/8 - భారత్  vs  ఇంగ్లండ్, 1979 (లక్ష్యం: 438);  ఫలితం: డ్రా
423/7 - దక్షిణాఫ్రికా  vs  ఇంగ్లండ్, 1947 (లక్ష్యం: 451); ఫలితం: డ్రా
369/6 -  ఇంగ్లండ్  vs  ఇండియా, 2007 (లక్ష్యం: 500); ఫలితం: డ్రా
348 - ఆస్ట్రేలియా  vs ఇంగ్లండ్, 2009 (లక్ష్యం: 646); ఫలితం: ఓటమి 
345 - భారత్  vs  ఇంగ్లండ్, 2018 (లక్ష్యం: 464); ఫలితం: ఓటమి 

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక రన్ ఛేజింగ్‌లు

418 - వెస్టిండీస్  vs ఆస్ట్రేలియా - 2003
414 - దక్షిణాఫ్రికా  vs ఆస్ట్రేలియా - 2008
404 - ఆస్ట్రేలియా vs  ఇంగ్లండ్ - 1948
403 - ఇండియా  vs వెస్టిండీస్ - 1976
395 - వెస్టిండీస్ vs బంగ్లాదేశ్ - 2021.

టెస్టుల్లో భారత్ విజయం సాధించిన అత్యధిక రన్ చేజింగ్‌లు

403 -  vs వెస్టిండీస్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ - 1976
387 -  vs  ఇంగ్లండ్, చెన్నై 2008 -
328 -  vs ఆస్ట్రేలియా, బ్రిస్బేన్ - 2021
276 - vs వెస్టిండీస్, ఢిల్లీ 2011
264  vs  శ్రీలంక, క్యాండీ - 2001