చంద్రయాన్‌-3 ప్రయోగంలో కీలక మార్పు .. మిషన్‌ ఆలస్యం

చంద్రయాన్‌-3 ప్రయోగంలో కీలక  మార్పు .. మిషన్‌ ఆలస్యం

చంద్రయాన్‌-3 ప్రయోగంలో కీలక  మార్పు చోటుచేసుకుంది.  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ ప్రయోగం కాస్త ఆలస్యం కానుంది. 2023 జూలై 13న ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లుగా వెల్లడించిన ఇస్రో.. ఇప్పుడు ఒక రోజు ఆలస్యంగా అంటే  2023 జులై  రాకెట్‌ను నింగిలోకి పంపనున్నట్లుగా తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి మధ్యాహ్నం 2:35 గంటలకు అంతరిక్ష నౌకను పంపుతామని వెల్లడించింది. 

 అయితే ఆలస్యానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.  ఈ మిషన్‌ చంద్రుడిపై రోవర్‌ను దించేందుకు భారత్‌ చేస్తున్న మూడో ప్రయత్నం., ఇప్పటి వరకు ఎవరూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఇస్రో 2019లో చంద్రయాన్‌-2 మిషన్‌ను చేపట్టింది. అయితే, చంద్రుడి ఉపరితలంపై విక్రమ్‌ ఆర్బిటర్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ విఫలమైనప్పటికీ.. చంద్రుని చుట్టూ ప్రస్తుతం విజయవంతంగా పరిభ్రమిస్తోంది.