వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో 15 పతకాలతో అగ్రస్థానం

వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో 15 పతకాలతో అగ్రస్థానం

చాంగ్వాన్‌‌‌‌‌‌‌‌‌‌: మరో ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ షూటింగ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఇండియా టాప్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ చేసింది. చాంగ్వాన్‌‌‌‌ వేదికగా బుధవారం ముగిసిన వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియా 15 పతకాలతో అగ్రస్థానం సాధించింది. ఇందులో ఐదు గోల్డ్‌‌‌‌, ఆరు సిల్వర్‌‌‌‌, నాలుగు బ్రాంజ్‌‌‌‌ ఉన్నాయి. పోటీల చివరి రోజు 25 మీ. ఫైర్‌‌‌‌ పిస్టల్‌‌‌‌ మెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో  అనీశ్‌‌‌‌ భన్వాల, విజయ్‌‌‌‌వీర్‌‌‌‌ సిద్దూ, సమీర్‌‌‌‌తో కూడిన ఇండియా సిల్వర్‌‌‌‌ సాధించింది. ఫైనల్లో  ఇండియా 15–17తో చెక్‌‌‌‌ రిపబ్లిక్‌‌‌‌ జట్టు చేతిలో ఓడిపోయింది. ఓ దశలో 10–2తో ఆధిక్యంలో నిలిచి గోల్డ్‌‌‌‌పై ఆశలు రేపిన ఇండియన్స్‌‌‌‌ చివర్లో డీలా పడ్డారు. ఇక, స్కీట్‌‌‌‌ మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో మేరాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ ఖాన్‌‌‌‌, ముఫద్దాల్‌‌‌‌ దీసవాల  150కి గాను 138 స్కోరుతో తొమ్మిదో స్థానంతో నిరాశ పరిచారు.