GT vs KKR: అడ్డుపడుతున్న వరుణుడు.. గుజరాత్- కోల్‌కతా మ్యాచ్ ఆలస్యం

GT vs KKR: అడ్డుపడుతున్న వరుణుడు.. గుజరాత్- కోల్‌కతా మ్యాచ్ ఆలస్యం

ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం(మే 13) గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడుతున్నాడు. అహ్మదాబాద్‌లో ప్రస్తుతం చిన్నపాటి వర్షం కురుస్తోంది. దీంతో సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. టాస్‌ ఆలస్యం కానుంది.

18 పాయింట్లతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే తమ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. గుజరాత్ టైటాన్స్ ఏదైన అద్భుతం జరగకపోతుందా అని వేచిచూస్తోంది.  ఇప్పటివరకూ 12 మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించిన టైటాన్స్.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. వీరు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సివుండగా.. రెండింట విజయం సాధిస్తే 14 పాయింట్లు వీరి ఖాతాలోకి చేరతాయి. అప్పుడు ఇతర జట్ల సమీకరణాలను బట్టి వీరికి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి.