జొహనెస్‌బర్గ్: విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని ఇండియా టెస్టు టీమ్ సౌతాఫ్రికా గడ్డపై ల్యాండ్ అయింది. మూడు టెస్టుల సిరీస్ కోసం ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో జర్నీ చేసిన ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, ఫ్యామిలీ మెంబర్స్ గురువారం జొహనెస్‌బర్గ్ చేరుకున్నారు. ప్లేయర్లు ఎయిర్‌పోర్టులో దిగిన ఫొటోలను బీసీసీఐ తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.ఎయిర్‌పోర్టు నుంచి టీమ్ అంతా క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) ఏర్పాటు చేసిన హోటల్‌కు చేరుకుంది. ఒక రోజు ఐసోలేషన్‌లో ఉండనుంది. ఈ టైమ్‌లో టీమ్‌లోని ప్రతీ మెంబర్‌కు మూడుసార్లు కరోనా టెస్టులు చేస్తారు. వీటిలో క్లియర్ అయితే శుక్రవారం సెంచూరియన్‌లోని టీమ్ హోటల్‌కు చేరుస్తారు. 19వ తేదీ నుంచి టీమిండియా ప్రాక్టీస్ స్టార్ట్ చేయనుంది. కరోనా నేపథ్యంలో ఈ టూర్ మొత్తం బయో బబుల్‌లో సాగనుంది. కాగా, టెస్టు టీమ్ వైస్ కెప్టెన్‌గా అపాయింట్ అయిన రోహిత్ శర్మ గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.
