ఇండియా వర్సెస్ ఆసీస్ మ్యాచ్ టికెట్లు..ఎలా కొనాలంటే..!

 ఇండియా వర్సెస్ ఆసీస్ మ్యాచ్ టికెట్లు..ఎలా కొనాలంటే..!

హైదరాబాద్ అంతర్జాతీయ టీ20 మ్యాచ్కు వేదిక కానుంది. సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియా టీమిండియా మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లో సెప్టెంబర్ 25న చివరి టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్ల అమ్మకాలను మొదవనున్నాయి. మ్యాచ్ ఏర్పాట్లలో  నిమగ్నమైన HCA అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ..సెప్టెంబర్ 15 నుంచి భారత్ ఆస్ట్రేలియా చివరి టీ20 మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపాడు. 

టిక్కెట్లు ఎలా కొనాలి..
మూడో టీ20  టిక్కెట్లు Paytm ఇన్‌సైడర్ యాప్‌లో సెప్టెంబర్ 15 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. లేదా టిక్కెట్లను స్టేడియం కౌంటర్లలో ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయొచ్చు.  స్టూడెంట్లు తమ ఐడీ కార్డులు చూపించి స్టేడియం వద్ద డిస్కౌంట్లో  టిక్కెట్లను..మ్యాచ్కు ముందు రోజు నుంచి కొనుక్కోవచ్చు. ప్రస్తుతానికి సేల్ లింకు ఓపెన్ కాలేదు. రాత్రి 8 గంటలకు లింక్ ఓపెన్ అవుతుందన్నారు. టిక్కెట్ ధరలు దాదాపు రూ.800నుంచి ప్రారంభం కావొచ్చు. జీఎస్టీ అదనం. స్టూడెంట్లకు ప్రత్యేక రాయితీతో టికెట్లు అందుబాటులో ఉంటాయి.


 
భారీ సెక్యూరిటీ..
రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుండటంతో..మ్యాచ్కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.  ఈ మేరకు  రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్. షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా