IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?

IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?

వరల్డ్ కప్ తర్వాత వారం రోజులు గడవకుండానే టీమిండియా ఆస్ట్రేలియాతో 5 టీ20 ల మ్యాచ్ ల సిరీస్ కు సిద్ధమైంది. ఇందులో భాగంగా నేడు(నవంబర్ 23) తొలి టీ20 మ్యాచ్ లో కంగారులను ఢీ కొట్టబోతుంది. వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయినా ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. వైజాగ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

స్పోర్ట్స్ 18 ఛానెల్

సాధారణంగా భారత్ వేదికగా మ్యాచ్ లు జరిగితే స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. కానీ నేటి నుంచి జరగనున్న భారత్, ఆస్ట్రేలియా టీ 20 సిరీస్ స్పోర్ట్స్ 18 ఛానెల్ లో మాత్రమే టీవీలో చూడొచ్చు. మొబైల్స్ లో ఈ మ్యాచ్ ను జియో సినిమాలో లైవ్ వస్తుంది. ఇటీవలే జరిగిన వరల్డ్ కప్ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఫ్రీగా చూసిన అభిమానులకి భారత్, ఆస్ట్రేలియా సిరీస్ టీ 20 సిరీస్ జియో సినిమా లైవ్ చూసే అవకాశం కల్పిస్తుంది. 

2024 ప్రపంచ కప్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు నేటితో తమ వేట ప్రారంభించనున్నారు. భారత జట్టు యువ ఆటగాళ్లతో నిండిపోతే.. ఆసీస్ సీనియర్, జూనియర్ ప్లేయర్లతో భారత్ కంటే బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆసీస్ వరల్డ్ కప్ జట్టులో ఉన్న స్మిత్, మ్యాక్స్ వెల్, హెడ్, స్టోయినీస్ ఉన్న ఆసీస్ జట్టును తట్టుకొని నిలబడాలంటే భారత జట్టుకు పెద్ద సవాలే. టీ 20 నెంబర్ వన్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ టీమిండియా కెప్టెన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మరోవైపు ఆసీస్ జట్టు వేడ్ కెప్టెన్సీలో ఆడబోతుంది.