V6 News

రెండో రోజు భారత్ దే పై చేయి

రెండో రోజు భారత్ దే పై చేయి

న్యూజిలాండ్ తో జరుగుతోన్న సెకండ్ టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో  వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్ 38, పుజారా29 పరుగులతో  ఉన్నారు. దీంతో ఇండియా 332 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ 62 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అశ్విన్ 4, సిరాజ్ 3, అక్షర్ పటేల్ 2, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశారు. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేసింది.