న్యూజిలాండ్ తో జరుగుతోన్న సెకండ్ టెస్టులో రెండో రోజు టీమిండియా విజృంభిస్తోంది. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ కు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది.38 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది కివీస్. ఒపెనర్లు టామ్ లేథమ్10, విల్ యంగ్ 4 పరుగులకే మహమ్మద్ సిరాజ్ పెవిలియన్ కు పంపాడు. తర్వాత వచ్చిన డారీ మిచెల్ ను కూడా 8 పరుగులకే అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. రాస్ టేలర్1, హెన్రీ నికోలస్ 7పరుగులకే ఔట్ అయ్యారు. దీంతో న్యూజిలాండ్ 17 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 325 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

