భారత్ తో జరుగుతోన్న రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 62 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు సిరాజ్, అశ్విన్ దెబ్బకు కివీస్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ బాటపట్టారు. ఒక్కు కూడా 20 పరుగులు చేయలేదు. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ టామ్ లేథమ్ 10, విల్ యంగ్ 4, డారీ మిచెల్ 8, రాస్ టేలర్ 1, హెన్రీ నికోల్స్7 , టామ్ బ్లండెల్ 8, రాచిన్ రవీంద్ర4, జేమిసన్ 17, టిమ్ సోథి సోమర్ విలే డకౌట్ అయ్యారు. భారత బౌలర్లు అశ్విన్ 4,సిరాజ్3, అక్షర్ పటేల్ 2, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశారు. భారత్ ఇంకా 263 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.ప్రస్తుతం మయాంక్ 4, ,పుజారా 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 325 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
#INDvzNZ | 2nd Test, day 2: New Zealand all out on 62, trail by 263 runs at Wankhede Stadium, Mumbai. (Ravichandran Ashwin 4-8, Mohammed Siraj 3-19)
— ANI (@ANI) December 4, 2021
(Pic Source: BCCI Twitter account) pic.twitter.com/1kD6SME0ts

