V6 News

పారా షట్లర్ల మెడల్స్‌‌  మోత

పారా షట్లర్ల మెడల్స్‌‌  మోత

కంపాల: ఉగాండా పారా బ్యాడ్మింటన్‌‌ ఇంటర్నేషనల్‌‌ టోర్నమెంట్‌‌లో ఇండియా పారా షట్లర్లు అదరగొట్టారు. 16 గోల్డ్‌‌, 14 సిల్వర్‌‌, 17 బ్రాంజ్‌‌ కలిపి వేర్వేరు కేటగిరీల్లో మొత్తం 47 మెడల్స్‌‌ సాధించి శభాష్‌‌ అనిపించారు.  పాలక్‌‌ కోహ్లీ, అబు హుబైదా, అమ్మూ మోహన్‌‌ రెండు గోల్డ్‌‌, ఓ సిల్వర్‌‌ చొప్పున తలా మూడు మెడల్స్‌‌ సాధించారు. విమెన్స్‌‌ సింగిల్స్‌‌ ఎస్‌‌ఎల్‌‌–3 ఈవెంట్‌‌లో మాన్సి జోషీ గోల్డ్‌‌ మెడల్‌‌ గెలిచింది. ఇక, టోక్యో పారాలింపిక్‌‌ గోల్డ్‌‌ మెడలిస్ట్‌‌ ప్రమోద్‌‌ భగత్‌‌ ఈ టోర్నీలో మూడు సిల్వర్‌‌ మెడల్స్‌‌తో సరిపెట్టుకున్నాడు. మెన్స్‌‌ సింగిల్స్‌‌ ఎస్‌‌ఎల్‌‌–3, మెన్స్‌‌ డబుల్స్‌‌ ఎస్‌‌ఎల్‌‌3–ఎస్‌‌ఎల్‌‌ 4, మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌ ఎస్‌‌ఎల్‌‌ 3–ఎస్‌‌యూ5 కేటగిరీల్లో ఫైనల్‌‌ చేరిన ప్రమోద్‌‌ మూడింటిలోనూ రన్నరప్‌‌గా నిలిచాడు.