V6 News

ACT నుంచి భారత్ హాకీ మహిళల జట్టు అవుట్

ACT నుంచి భారత్ హాకీ మహిళల జట్టు అవుట్

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ( ACT)లో భారత్ హాకీ మహిళల జట్టు విజయాలను కరోనా వైరస్ అడ్డుకుంది. కరోనా  కారణం గా ఏకం గా టోర్నీ నుంచే భారత్ తప్పుకుంది. ఇండియా ఉమెన్స్ హాకీ టీంలో కొద్ది రోజుల కిందట కరోనా వైరస్ సోకింది. దీంతో దక్షిణ కొరియా తో జరగవల్సిన మ్యాచ్ రద్దైంది. అంతే కాకుండా కరోనా వైరస్ కారణం గా ఈ మెగా టోర్నీ నుంచి భారత్ ను తొలగిస్తున్నట్టు ఆసియా హాకీ సమాఖ్య ప్రకటించింది.

ఈ ఏడాది మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫి దక్షిణ కొరియా లో నిర్వహిస్తున్నారు. అయితే ఈ టోర్నీ లో భాగం గా దక్షిణ కొరియా కు వచ్చిన భారత్ జట్టు లో ఒక ప్లేయర్ కు కరోనా వైరస్ సోకింది. దీంతో దక్షిణ కొరియా తో జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి ని దృష్టి లో ఉంచుకుని ఈ టోర్నీ మొత్తం నుంచి భారత జట్టు తప్పించారు. అయితే భారత జట్టు లో కరోనా కేసు నమోదు కావడంతో  భారత్.. మలేసియా టోర్నీ నుంచి కూడా వైదొలగింది.