అస్సాంలో ఘోర ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా.. క్షణాల్లోనే కుప్పకూలిన ఎయిర్ క్రాఫ్ట్

అస్సాంలో ఘోర ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా..  క్షణాల్లోనే కుప్పకూలిన ఎయిర్ క్రాఫ్ట్

అస్సాంలో ఘోర ఎయిర్ ఫోర్స్ విమాన ప్రమాదం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన AN-32 ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో..  కొద్ది క్షణాల్లోనే కుప్పకూలింది. శనివారం (జూన్ 13) జోహ్రాత్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్.. వెంటనే ఎయిర్ బేస్ పరిసరాల్లోనే కూలిపోయింది. 

ఎయిర్ క్రాఫ్ట్ లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా పొగలు కక్కుతూ కూలిపోవడం అధికారులను ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు అనే పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. 

IAF కు చెందిన AN-32  ప్రమాదానికి గురైంది.. పూర్తి సమాచారం త్వరలో వెల్లడిస్తామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటన విడుదల చేసింది. విమానం కూలిన వెంటనే సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. 

ఆంటోనోవ్ ఆన్-32 అనే  రెండు ఇంజన్లు గల టర్బోప్రాప్ సైనిక రవాణా విమానం. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు వర్క్‌హార్స్ గా పనిచేస్తుంది. భారత అవసరాల కోసం సోవియట్ యూనియన్‌ (రష్యా)లో తయారు చేసిన ఈ విమానాలలో సుమారు 100  ఎయిర్ క్రాఫ్ట్ లు సేవలందిస్తున్నాయి. 

ఏఎన్-32 విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితులలో రాణించేలా తయారు చేశారు. ఇది ఎత్తైన ప్రదేశాలలోని ఎయిర్‌ఫీల్డ్‌లలో, వేడి ఉష్ణమండల వాతావరణాలలో పనిచేస్తుంది. ఇది 7.5 టన్నుల వరకు సరుకును, 50 మంది ప్రయాణికులను లేదా 42 మంది పారాట్రూపర్‌లను మోసుకెళ్లగలదు.  మారుమూల ప్రాంతాలలో సామాగ్రిని జారవిడవడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.