బాలాకోట్ దాడుల వీడియో విడుదల

బాలాకోట్ దాడుల వీడియో విడుదల

ఈ ఏడాది ఫిబ్రవరి 14న కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన టెర్రర్ ఎటాక్ కు ప్రతీకారంగా భారత్ జరిపిన ప్రతీకార దాడులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీడియో రూపంలో విడుదలచేసింది. భారతీయ వాయుసేన సాధించిన విజయాల్లో భాగంగా.. ఈ వీడియోను రూపొందించారు. ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా.. ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ వీడియోను ప్రదర్శించారు ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా.

బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఎలా జరిగాయో వివరించారు ఆర్కేఎస్ భదౌరియా. పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాల కాన్వాయ్ పై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసిన కొద్దిరోజులకే భారత వాయిసేన ప్రతీకారం తీర్చుకుందని చెప్పారు. పాకిస్థాన్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన ప్రణాళికతో దాడులు చేశామని వివరించారు. మిరాజ్ 2000 జెట్ విమానాలు ఎలా ఎగిరాయి… పాకిస్థాన్ గగనతలంలోకి ఎలా వెళ్లాయి.. ఎక్కడ బాంబులు వేశాయి… బాలాకోట్ లో ఉగ్రవాదస్థావరాలు ఎక్కడ ఉన్నాయి… బాంబులు వేశాక అక్కడి స్థావరాలు ఎలా ధ్వంసమయ్యాయి.. లాంటి వివరాలతో ఈ వీడియో రూపొందించారు.