హెచ్‌డి రేవణ్ణకు మే 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ

 హెచ్‌డి రేవణ్ణకు మే 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ

మహిళ కిడ్నాప్ కేసులో అరెస్టైన కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డి రేవణ్ణకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన  మే 14 వరకు కస్టడీలో ఉండనున్నారు. ఈ కేసులో మే 04న  సిట్ బృందం ఆయన్న అరెస్ట్ చేసింది.  రేవణ్ణ కుమారుడు,  హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తన తల్లిని లైంగికంగా వేధించారని ఆ మహిళ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. బెంగళూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై కిడ్నాప్ కేసు నమోదైంది. 

అయితే ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా అడ్డుకునేందుకే మహిళను రేవణ్ణ కిడ్నాప్ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి.  కాగా హాసన్ లోక్‌సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరిగిన ఒక రోజు తర్వాత సెక్స్ స్కాండల్ తెరపైకి వచ్చింది. పలువురు మహిళలను ప్రజ్వల్ లైంగిక వేధింపులకు గురిచేసినట్లుగా వీడియోలు బయటకు వచ్చాయి.  ఈ క్రమంలో  ప్రజ్వల్ రేవణ్ణను జెడీఎస్ సస్పెండ్ చేసింది. వీడియోలు బయటకు రావడంతో ప్రజ్వల్ జర్మనీకి పారిపోయాడు.