ఒలింపిక్స్‌లో పతకం కోసం పోటీపడుతున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు వరుస టోర్నీల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో ప్రారంభంకా నున్న థాయ్‌లాండ్ ఓపెన్ కోసం పయనమయ్యారు. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌తో పాటు, సాయిప్రణీత్, కిదాంబి శ్రీకాంత్, సాత్విక్‌రాజ్, చిరాగ్‌శెట్టి, అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి థాయ్‌లాండ్ వెళ్లిన టీంలో సభ్యులుగా ఉన్నారు. ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు లండన్ నుంచి దోహా మీదుగా బ్యాంకాక్ చేరుకోనుంది. శ్రీకాంత్ గత అక్టోబర్‌లో డెన్మార్క్ సూపర్ 750లో పాల్గొనగా మిగిలినవారు 10నెలల విరామం తరువాత మళ్లీ బరిలోకి దిగనున్నారు.
