అక్కడి మహిళలు జింకలకు పాలిస్తారు... జోలపాట పాడతారు...

అక్కడి మహిళలు జింకలకు పాలిస్తారు... జోలపాట పాడతారు...

ఓ తెగ ప్రజలకు పకృతిని దేవుడిగా కొలుస్తారు. అడవి జంతువులే(Animals) వారికి బంధువులు, ఆత్మీయులు. జింకలకు(Deers) పాలిస్తూ కన్నపిల్లల్లా చూస్తారు. ఒడిలో పడుకోబెట్టుకుని జోలపాట పాడుతారు. రాజస్థాన్‌లో(Rajasthan) బిష్ణోయ్‌ తెగ ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

రాజస్థాన్‌లోని బిష్ణోయ్ తెగ ప్రజలకు ప్రకృతే దేవుడు. అడవి జంతువులే ఆత్మీయులు. అందుకే అక్కడి మహిళలు జింక పిల్లలను కన్నపిల్లల్లా చూసుకుంటారు. ఒడిలో పడుకోబెట్టుకొని పాలిస్తారు.దాదాపు 600 ఏళ్లుగా ప్రకృతిని కొలుస్తారు. ప్రకృతి వల్లే తమ ఉనికి ఉందని నమ్ముతారు. అందుకే ప్రకృతినే దేవుడిగా (God)పూజిస్తారు.

మనలో చాలా మంది ఇళ్లల్లో కుక్కలు, పిల్లులను పెంచుకుంటారు. వాటిని అల్లారుముద్దుగా చూసుకుంటారు.సొంత పిల్లల్లా భావిస్తారు. కానీ రాజస్థాన్‌లోని ఓ తెగ వారు మాత్రం జింకలను పెంచుకుంటారు.  రాజస్థాన్ లోని బిష్ణోయ్ కమ్యూనిటీ ప్రజలు దాదాపు ఆరు వందల ఏళ్లుగా ప్రకృతిని ఆరాధిస్తున్నారు. ప్రకృతి కారణంగానే తాము ఉనికిలో ఉన్నామని చెబుతుంటారు. అందుకే ప్రకృతినే దేవుడిగా కొలుస్తారు. ఇక్కడి ప్రజలు అడవిలో గాయపడిన, ఒంటరిగా ఉన్న జింక పిల్లలను(Fawn) చేరదీసి.. వాటి ఆలనా పాలనా చూస్తుంటారు. ముఖ్యంగా మహిళలు(Women)... వాటిని సొంత బిడ్డలా పెంచుకుంటారు. జింకలకు స్వయంగా తమ పాలు(Breast Feed) పడతారు.తమ బిడ్డలను ఎలా అయితే ఒడిలో పడుకోబెట్టుకొని పాలు ఇస్తారో.. అచ్చం అలానే జింక పిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకొని పాలిస్తారు. వారికి ఉయ్యాలలు కూడా కట్టి.. జోల పాడతారు. నిద్రపుచ్చుతారు. జింకలంటే అక్కడి ప్రజలకు అంత ప్రాణం. 

పశ్చిమ థాయ్   ఎడారిలో ( Desert) నివసించే.. బిష్ణోయ్ కమ్యూనిటీలో సుమారు రెండు వేల ఇళ్లు ఉన్నాయి. వారు హిందూ మతాన్ని నమ్ముతారు. హిందూ మత (Hindu Religion)గురువు శ్రీ జాంబేశ్వర్ భగవాన్ బోధనలను అనుసరిస్తారు.ఇక్కడి ప్రజలు ప్రకృతితో బలమైన బంధాన్ని కలిగి ఉంటారు. అందుకే అడవి జంతువులను సొంత పిల్లల్లా భావిస్తారు. వాటిని అనాథలుగా వదిలేయకుండా.. అన్నీ తామై చూసుకుంటారు