బాక్సింగ్‌లో భారత్ బంగారు చరిత్ర.. 96 ఏళ్ల రికార్డు బ్రేక్.. 7 గోల్డ్‌లతో హిస్టరీ!

బాక్సింగ్‌లో భారత్ బంగారు చరిత్ర.. 96 ఏళ్ల రికార్డు బ్రేక్.. 7 గోల్డ్‌లతో హిస్టరీ!

Indian Boxers Medals: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 బాక్సింగ్ రింగ్‌లో భారత్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. 1930లో కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమైనప్పటి నుంచి అంటే గత 96 ఏళ్ల కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే ఏ దేశం సాధించని విధంగా బాక్సింగ్‌లో ఒకే ఎడిషన్‌లో ఏకంగా 7 స్వర్ణ పతకాలు (7 Gold Medals) కొల్లగొట్టి భారత బాక్సింగ్ దళం ఆల్-టైమ్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది. శనివారం (ఆగస్టు 1) ఎస్ఈసీ సెంటర్‌లో జరిగిన ఫైనల్స్ రణరంగంలో ఫైనల్‌కు చేరిన 10 మంది భారత బాక్సర్లలో ఏకంగా 7 మంది స్వర్ణాలు, ముగ్గురు రజతాలు సాధించి 10 మెడల్స్‌తో కామన్వెల్త్ బాక్సింగ్ హిస్టరీని తిరగరాశారు.  

40 ఏళ్ల కెనడా, ఇంగ్లాండ్ రికార్డు బ్రేక్:

కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమైన ఈ 96 ఏళ్ల కాలంలో బాక్సింగ్ అత్యంత కీలకమైన క్రీడగా కొనసాగుతోంది. గతంలో 1986లో కెనడా (6 గోల్డ్ మెడల్స్), ఆ తర్వాత 2018లో ఇంగ్లాండ్ (6 గోల్డ్ మెడల్స్) సాధించిన రికార్డులే ఇప్పటి వరకు అత్యుత్తమంగా ఉండేవి. ఆ 40 ఏళ్ల నాటి రికార్డును గ్లాస్గో 2026 వేదికగా భారత్ 7 గోల్డ్ మెడల్స్‌తో అధిగమించి చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ బాక్సింగ్ టీమ్‌గా అవతరించింది. 

గత రికార్డులను బ్రేక్ చేసిన భారత్: 

* 3 రెట్లు పెరిగిన స్వర్ణాలు: గతంలో 2010 (న్యూఢిల్లీ), 2018 (గోల్డ్ కోస్ట్), 2022 (బర్మింగ్‌హామ్) కామన్వెల్త్ గేమ్స్‌లలో అత్యుత్తమంగా తలో 3 స్వర్ణాలు గెలుచుకున్న ఇండియా, ఈసారి ఏకంగా 7 స్వర్ణాలు సాధించి తన పాత రికార్డును దాదాపు మూడు రెట్లు పెంచుకుంది. 

* మొత్తం పతకాల రికార్డు సమం: మొత్తం 10 పతకాలతో (7 గోల్డ్, 3 సిల్వర్) కామన్వెల్త్ బాక్సింగ్ చరిత్రలోనే ఒకే ఎడిషన్‌లో అత్యధిక మెడల్స్ సాధించిన 1986 కెనడా, ఇంగ్లాండ్ జట్ల ఆల్-టైమ్ రికార్డును భారత్ ఈసారి సమం చేసింది.  

బాక్సింగ్లో ఏకంగా 7 స్వర్ణాలు:

10వ రోజు భారత బాక్సర్లు రింగ్‌లో ప్రత్యర్థులను ఊచకోత కోశారు. ఒకే రోజు 10 మెడల్స్ (7 గోల్డ్, 3 సిల్వర్) కొల్లగొట్టి కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే ఒకే ఎడిషన్‌లో అత్యధిక బాక్సింగ్ పతకాలు సాధించిన దేశంగా భారత్ ఆల్-టైమ్ రికార్డు సృష్టించింది. 

స్వర్ణ పతక విజేతలు (7 Gold):

* ప్రీతి పవార్ (మహిళల 54 కేజీలు)
* జాస్మిన్ లాంబోరియా (మహిళల 57 కేజీలు)
* అరుంధతి చౌదరి (మహిళల 70 కేజీలు)
* ప్రియా ఘంగాస్ (మహిళల 60 కేజీలు)
* సాక్షి చౌదరి (మహిళల 51 కేజీలు)
* సచిన్ సివాచ్ (పురుషుల 60 కేజీలు)
* అంకుష్ పంగల్ (పురుషుల 80 కేజీలు)

రజత పతక విజేతలు (3 Silver):

* లవ్లీనా బొర్గోహైన్ (మహిళల 75 కేజీలు)
* నరేందర్ బెర్వాల్ (పురుషుల 90+ కేజీలు)
* జాదుమణి సింగ్ (పురుషుల 55 కేజీలు)