తారామతి బరాదరిలో భారతీయ సంగీత వైభవం

తారామతి బరాదరిలో భారతీయ సంగీత వైభవం

హైదరాబాద్​ సిటీ, వెలుగు: తారామతి బరాదరి వేదికపై భారతీయ సంగీత వైభవం అలరారింది. నగరంలోని ప్రముఖ సాంస్కృతిక వేదిక ‘చౌరంగీ’ ఆధ్వర్యంలో ‘గాయకి, గత్, గజల్’ అనే సంగీత కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రఖ్యాత సితార్ విద్వాంసుడు పూర్బయన్ ఛటర్జీ, గాయని గాయత్రి అశోకన్‌‌ శాస్త్రీయ, సమకాలీన సంగీత సమ్మేళనంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.

ఈషాన్ ఘోష్ (టేబుల్), శిఖర్ నాద్ ఖురేషి, అబ్షార్ అహ్మద్, స్టీవ్ థామస్  వంటి ప్రముఖ వాద్యకారులు పాల్గొన్నారు. చౌరంగీ అధ్యక్షుడు డాక్టర్ శంతను పాల్ మాట్లాడుతూ సంగీత ప్రవాహంలో ప్రేక్షకులు తడిసిముద్దయ్యారని, ఇది మరపురాని అనుభూతిని మిగిల్చిందన్నారు.