సునీల్ ఛెత్రిని పక్కకు నెట్టేసిన బెంగాల్ గవర్నర్

సునీల్ ఛెత్రిని పక్కకు నెట్టేసిన బెంగాల్ గవర్నర్

భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రికి ఘోర అవమానం జరిగింది.  డురాండ్ కప్ ఫైనల్ జరిగిన తర్వాత ట్రోఫీ అందుకునే సమయంలో ఛెత్రీని పశ్చిమ బెంగాల్ గవర్నర్ లా గణేశన్ పక్కకు నెట్టేశారు. ఫోటో కోసం ఛెత్రీని పక్కకు నెట్టి ఫోటోకు పోజులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. లా గణేశన్ తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఫుట్బాల్ దిగ్గజానికి మర్యాద లేదా?
ఆదివారం కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో బెంగుళూరు ఫుట్బాల్ క్లబ్, ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ మధ్య డురాండ్ కప్ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్లో సునీల్ ఛెత్రి నాయకత్వంలోని బెంగుళూరు ఎఫ్ సీ 2-1తో విజయం సాధించింది.   బెంగళూరు ఎఫ్‌సి  తరఫున శివశక్తి, బ్రెజిలియన్ అలాన్ కోస్టా గోల్స్ చేశారు. బెంగళూరు కెప్టెన్ సునీల్ ఛెత్రీకి కూడా 69వ నిమిషంలో గోల్ చేయడానికి ఛాన్సులు లభించాయి.   లెఫ్ట్ లెగ్ తో చేసిన స్ట్రైక్ గురి తప్పింది. ఆ తర్వాత 87వ నిమిషంలో గోల్ మిస్సయింది. మ్యాచ్ ముగిసే సమయానికి స్కోరు 2-1 కావడంతో..బెంగుళూరు విజేతగా నిలిచింది. మ్యాచ్ తర్వాత ట్రోఫీ బహుకరణకు ఇంచార్జ్ గవర్నర్ లా గణేశన్ అతిథిగా వచ్చారు.  ఈ సమయంలో ఫోటోలు తీస్తుండగా..గవర్నర్ లా గణేశన్..ఛెత్రిని పక్కకు నెట్టిసి..ఫోటోలకు పోజులిచ్చాడు. గవర్నర్ లా గణేషన్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.

గవర్నర్ తీరుపై ఆగ్రహం..
టీమిండియా ఫుట్‌బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రిని పక్కకు తోసేస్తూ గణేషన్ చేసిన పనికి ఫుట్ బాల్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడికి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా..? అని  ప్రశ్నిస్తున్నారు. ఏం ఒరగబెట్టారని..ఫోటోలకు అంత తాపత్రయం పడుతున్నారని మండిపడుతున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇది అవమానకరం అని కామెంట్ చేశాడు.