
న్యూఢిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ షూటర్ ధనుశ్ శ్రీకాంత్ గోల్డ్‌తో మెరిశాడు. కొరియాలోని చాంగ్వాన్‌లో మంగళవారం జరిగిన మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో శ్రీకాంత్, పార్థ్ మానే, అభినవ్ షాతో కూడిన టీమ్ 1886.7 స్కోరుతో టాప్ ప్లేస్‌తో గోల్డ్ గెలిచింది. ఏపీకి చెందిన మదినేని ఉమామహేశ్ మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఇండివిడ్యువల్ ఈవెంట్‌లో 229.0 స్కోరుతో మూడో ప్లేస్‌తో బ్రాంజ్ నెగ్గాడు. విమెన్స్ స్కీట్ ఈవెంట్‌లో ఇండియా షూటర్ రైజా ధిల్లాన్ సిల్వర్ నెగ్గింది. మరో ఆరు రోజులు మిగిలున్న ఈ టోర్నీలో ఇండియా మొత్తం నాలుగు గోల్డ్ మెడల్స్‌తో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.