క్రూడాయిల్ ధరల ఎఫెక్ట్.. చమురు సంస్థలకు నెలకు రూ.30 వేల కోట్ల నష్టం

క్రూడాయిల్ ధరల ఎఫెక్ట్.. చమురు సంస్థలకు నెలకు రూ.30 వేల కోట్ల నష్టం
  • రోజుకి రూ.1,000 కోట్ల దాకా లాస్‌‌‌‌

న్యూఢిల్లీ: క్రూడాయిల్ ధరలు పెరగడంతో  ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకి రూ.700–1,000 కోట్లు, నెలకు సుమారు రూ.30 వేల కోట్లు నష్టపోతున్నాయి.  ఇరాన్‌‌‌‌–అమెరికా యుద్ధం కారణంగా క్రూడ్‌‌‌‌ ధరలు పెరుగుతున్నా,   ఐఓసీ, హెచ్‌‌‌‌పీసీఎల్‌‌‌‌, బీపీసీఎల్‌‌‌‌ మాత్రం లోకల్‌‌‌‌గా  పెట్రోల్‌‌‌‌, డీజిల్ రేట్లను పెంచకుండా, నష్టాన్ని భరిస్తున్నాయి.  ఈ ఏడాది  ఏప్రిల్‌‌‌‌లో లీటర్ పెట్రోల్‌‌‌‌పై రూ.18, డీజిల్‌‌‌‌పై రూ.25 మేర  నష్టపోయాయని అంచనా. 

120 డాలర్లకు క్రూడ్​ ఈ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో  రెండు నెలల క్రితం  70 డాలర్లుగా ఉన్న క్రూడ్ ఆయిల్, ఇప్పుడు 120 డాలర్లకు చేరింది. జపాన్, యూకే, జర్మనీ వంటి దేశాలు  ఫ్యూయల్ రేట్లను  22శాతం నుంచి 34శాతం వరకు పెంచాయి.  కానీ,  భారత్‌‌‌‌లో మాత్రం గత రెండేళ్ల స్థాయిలోనే ధరలను కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.94.77 వద్ద, డీజిల్ రూ.87.67 వద్ద,  హైదరాబాద్‌‌‌‌లో పెట్రోల్ ధర  రూ.107.50 వద్ద, డీజిల్ ధర రూ. 95.70 వద్ద స్థిరంగా ఉన్నాయి.  

చమురు సంస్థలపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌‌‌‌పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించింది. పెట్రోల్‌‌‌‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని రూ.13 నుంచి రూ.3కి తగ్గించగా, డీజిల్‌‌‌‌పై సుంకాన్ని సున్నాకు చేర్చింది. దీంతో  ప్రభుత్వ ఖజానాకు నెలకు రూ.14 వేల కోట్ల ఆదాయం తగ్గుతోంది. ఒకవేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకపోతే చమురు సంస్థల నెలవారీ నష్టం రూ.62,500 కోట్లకు చేరేది.