V6 News

టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌ వేణుగోపాల్‌ మృతి

టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌ వేణుగోపాల్‌ మృతి

ప్రముఖ భారత టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌, అర్జున అవార్డు గ్రహీత వేణుగోపాల్‌ చంద్రశేఖర్‌ (64) బుధవారం చనిపోయారు. ఆయన కొద్దిరోజులుగా కరోనా సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే .. ఆరోగ్య పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

భారత్‌లో ప్రముఖ క్రీడాకారులలో ఒకరైన చంద్రశేఖర్‌ మూడుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచారు. చెన్నైలో జన్మించిన చంద్రశేఖర్‌ 1982 కామన్వెల్త్‌ క్రీడల్లో సెమీఫైనల్‌ వరకు వెళ్లారు. ఆయన రిటైర్మెంట్‌ అయిన తర్వాత కూడా కోచ్‌గా కూడా పని చేశారు.