V6 News

ప్లేయర్‌‌కు కరోనా.. హాకీ నుంచి ఇండియా ఔట్

ప్లేయర్‌‌కు కరోనా.. హాకీ నుంచి ఇండియా ఔట్

డోంగయె (సౌత్‌‌ కొరియా): టీమ్‌‌లోని ఓ ప్లేయర్‌‌ కరోనా పాజిటివ్‌‌గా తేలడంతో  ఏషియన్‌‌ విమెన్స్‌‌ హాకీ చాంపియన్స్‌‌ ట్రోఫీ నుంచి ఇండియా  మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో థాయ్‌‌లాండ్‌‌పై గ్రాండ్‌‌ విక్టరీ సాధించిన ఇండియా ఈ మెగా టోర్నీ గొప్పగా స్టార్ట్‌‌ చేసింది. కానీ, ప్లేయర్‌‌ కరోనా బారిన పడటంతో బుధవారం కొరియాతో, గురువారం చైనాతో జరగాల్సిన మ్యాచ్‌‌లు క్యాన్సిల్ అయ్యాయి. ప్రస్తుతం టీమ్‌‌ మొత్తం క్వారంటైన్‌‌కు వెళ్లింది.  దాంతో, ఇకపై టోర్నీలో ఇండియా పోటీ పడటం లేదని ఏషియన్‌‌ హాకీ ఫెడరేషన్‌‌ ప్రకటించింది. వైరస్‌‌ సోకిన ప్లేయర్‌‌ పేరు వెల్లడించలేదు. లాస్ట్‌‌ ఎడిషన్‌‌లో ఇండియా విమెన్స్‌‌ టీమ్‌‌ రన్నరప్‌‌గా నిలిచింది. కాగా, టీమ్‌‌లో ఒకరు కరోనా పాజిటివ్‌‌గా తేలడంతో మలేసియా కూడా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.