మీరు గ్రేట్ : విదేశాలు వెళ్లి టమాటాలు కొంటున్న భారతీయులు

మీరు గ్రేట్ : విదేశాలు వెళ్లి టమాటాలు కొంటున్న భారతీయులు

భారత్​లో వంటింటి కింగ్​ టమాటా ధరలు ఎంతలా పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దాన్ని ముట్టుకోవాలన్ని కన్నీరు తెప్పిస్తోంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. 

వాతావరణ మార్పులు, దిగుబడి తగ్గడం.. వినియోగానికి సరిపడా సరకు రవాణా లేకపోవడం అన్నీ కలగలిపి టమాటా ధరల్ని కొండెక్కించాయి. నిత్యావసర వస్తువు అయిన టమాటా ధరలు ఎప్పుడు దిగొస్తాయోనని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఉత్తర భారత్​లోని ఓ రాష్ట్ర ప్రజలకు ఈ ఇబ్బందులు లేవట. ఎందుకో చూసేద్దాం పదండీ..

ఉత్తరాఖండ్​ రాష్ట్రం పితోర్​ఘర్ జిల్లాలోని భారత్–నేపాల్​ సరిహద్దు మైత్రి ఇప్పుడు టమాటల రూపంలో బలపడుతోంది. సరిహద్దుకి దగ్గరగా ఉన్న ధార్చుల, బన్​బాసా నివాసితులు టమాటల కోసం నేపాల్​కి వెళ్తున్నారు. 

భారత్ లో ప్రస్తుతం రూ.వందకు పైగే ఉన్న టమాటా ధరలు.. నేపాల్​లో సగానికే దొరుకుతుండటం విశేషం. దీంతో అక్కడి టమాటాలకు విపరీతమైన గిరాకీ ఉంటోంది.  ఒక్కో చోట కిలో టమాటా రూ.40 కే అమ్ముతున్నారు. నేపాలీలు.. ఇండియాలో కొరత ఏర్పడినప్పుడు కాలీఫ్లవర్​, బచ్చలికూర తదితర పంటల్ని  భారత్​కు ఎగుమతి చేస్తుంటారు.