చైనా పోయేదెప్పుడో.. మెడిసిన్‌‌‌‌ చదివేదెప్పుడో!

చైనా పోయేదెప్పుడో.. మెడిసిన్‌‌‌‌ చదివేదెప్పుడో!

న్యూఢిల్లీ:  చైనాలో మెడిసిన్‌‌‌‌ చదువుతున్న ఇండియా స్టూడెంట్ల పరిస్థితి కరోనా వల్ల ఆగమాగంగా తయారైంది. గతేడాది చలికాలం సెలవుల్లో సొంత దేశం వచ్చిన స్టూడెంట్లు.. ట్రావెలింగ్‌‌‌‌పై చైనా ఆంక్షలు పెట్టడంతో మళ్లీ ఆ దేశం వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. 17 నెలలుగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ క్లాసులనే వింటుండటం.. ఎంబీబీఎస్‌‌‌‌కు అతిముఖ్యమైన ప్రాక్టికల్‌‌‌‌ క్లాసులు లేకపోవడంతో సతమతమవుతున్నారు. దీనికి తోడు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ డిగ్రీలు చేసిన వాళ్లకు ఇండియాలో ఇంటర్న్‌‌‌‌షిప్‌‌‌‌కు అవకావం ఇవ్వకపోవడంతో తమ ఫ్యూచర్‌‌‌‌ ఏంటని బాధపడుతున్నారు.  

23 వేల మంది స్టూడెంట్లు

2019 లెక్కల ప్రకారం ఇండియాకు చెందిన 23 వేల మంది స్టూడెంట్లు చైనాలో వివిధ కోర్సుల్లో చేరారు. వీళ్లలో 21 వేల మందికి పైగా ఎంబీబీఎస్‌‌‌‌ చదువుతున్నారు. వింటర్‌‌‌‌ సెలవుల కోసం కిందటేడాది తొలినాళ్లలో ఇండియా వచ్చిన వీళ్లు.. కరోనా వల్ల ఇక్కడే ఉండిపోయారు. వైరస్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌లోకి రాకపోవడం, మళ్లీ మళ్లీ కేసులు పెరుగుతుండటంతో ట్రావెలింగ్‌‌‌‌పై చైనా ఆంక్షలు పెట్టింది. దీంతో మన స్టూడెంట్లు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ క్లాసులే నడుస్తున్నాయి. ఎంబీబీఎస్‌‌‌‌ వాళ్లకు ప్రాక్టికల్‌‌‌‌ క్లాసులు చాలా ముఖ్యమని, ఏడాదిన్నరగా అవేం లేక ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. వర్సిటీ యాజమాన్యాలేమో చైనాకు వచ్చాక అంతా చూసుకుంటామని చెబుతున్నారని, కానీ అది జరిగేలా లేదని చెబుతున్నారు. 

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ డిగ్రీ చెల్లదంటే..

ప్రాక్టికల్‌‌‌‌ క్లాసులకు తోడు ఇంటర్న్‌‌‌‌షిప్‌‌‌‌ సమస్య స్టూడెంట్లను వెంటాడుతోంది. కోర్సు ఫైనల్‌‌‌‌ ఇయర్‌‌‌‌లో ఏదైనా హాస్పిటల్‌‌‌‌, నర్సింగ్‌‌‌‌ హోమ్‌‌‌‌లో ఇంటర్న్‌‌‌‌షిప్‌‌‌‌ చేయాలని.. కానీ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ డిగ్రీ పొందిన వారికి దేశంలోని కొన్ని గవర్నమెంట్‌‌‌‌ సంస్థలు ఇంటర్న్‌‌‌‌షిప్‌‌‌‌కు అనుమతించట్లేదని స్టూడెంట్లు చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే మున్ముందు తాము ఇండియాలో ప్రాక్టీస్‌‌‌‌ చేస్తామో లేదో అనుమానంగా ఉందన్నారు. పాండమిక్‌‌‌‌ టైమ్‌‌‌‌ వరకే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ క్లాసులకు వ్యాలిడిటీ ఉంటుందని నేషనల్‌‌‌‌ మెడికల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ చెప్పినట్టు పలువురు చెబుతున్నారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఎంబీబీఎస్‌‌‌‌ను కమిషన్‌‌‌‌ చెల్లదని చెబితే తమ కెరీర్‌‌‌‌ నాశనమైనట్టేనని స్టూడెంట్లు అంటున్నారు. 

మోడీని రిక్వెస్ట్‌‌‌‌ చేసిన్రు

తమ సమస్యను రెండు దేశాలకు తెలియజెప్పడానికి 3 వేల మంది స్టూడెంట్లు టెలిగ్రామ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేశారు. ‘టేక్‌‌‌‌ బ్యాక్‌‌‌‌ టు చైనా’ పేరుతో క్యాంపెయిన్‌‌‌‌ మొదలుపెట్టారు. ప్రభుత్వం కల్పించుకోవాలని ప్రధాని మోడీని కలిసి విన్నవించారు. స్టూడెంట్ల విషయాన్ని చైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని అక్కడి ఇండియన్‌‌‌‌ ఎంబసీ అధికారులు చెప్పారు. అక్టోబర్‌‌‌‌లో ఇండియన్‌‌‌‌ స్టూడెంట్లను అక్కడికి అనుమతిచ్చే అవకాశముందని తెలుస్తోంది.