కరోనా కట్టడి కోసం భారత్ చర్యలు అద్భుతం

కరోనా కట్టడి కోసం భారత్ చర్యలు అద్భుతం
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గేబ్రియేసస్‌ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. కరోనా వైరస్ కట్టడికై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాత్మక చర్యలు బాగున్నాయన్నారు. కరోనా వైరస్‌ ఉనికిని అంతం చేసేందుకు వ్యాక్సిన్‌ కనుగొనే క్రమంలో ప్రపంచలోని అన్ని దేశాల కంటే భారత్‌ ముందుందన్నారు. దీనికి సంబంధించి టెడ్రోస్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. వ్యాక్సిన్ల అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న ఇండియాతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు టెడ్రోస్. అదే విధంగా WHO భారత్‌ కలిసికట్టుగా ముందుకు సాగితే అత్యంత ప్రభావంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్లను తయారు చేయవచ్చని టెడ్రోస్‌ తెలిపారు.తద్వారా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఉన్న బలహీన వర్గాలకు వ్యాక్సినేషన్‌ చేసేలా చర్యలు చేపట్టవచ్చని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరాటంలోమోడీ గొప్పగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా కొనియాడారు.