
భువనేశ్వర్: ఇండియా స్టార్ లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు క్వాలిఫై అయ్యాడు. నేషనల్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్‌లో భాగంగా ఆదివారం జరిగిన మెన్స్ క్వాలిఫయింగ్ రౌండ్లో తొలి ప్రయత్నంలోనే తన పర్సనల్ బెస్ట్ 8.41 మీటర్ల దూరం జంప్ చేయడం ద్వారా వరల్డ్ టోర్నీ బెర్తు దక్కించుకున్నాడు. జెస్విన్ అల్డ్రిన్ నేషనల్ రికార్డు (8.42 మీ.)కు కేవలం ఒక్క సెంటీ మీటర్ దూరంలో నిలిచిపోయాడు.