టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో అషి, స్వప్నిల్‌‌‌‌

టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో అషి, స్వప్నిల్‌‌‌‌

న్యూఢిల్లీ : ఇండియా స్టార్‌‌‌‌ షూటర్లు  అషి చౌక్సీ, స్వప్నిల్‌‌‌‌ కుశాలె.. ఒలింపిక్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌ (ఓఎస్‌‌‌‌టీ)లో సత్తా చాటారు. మంగళవారం జరిగిన విమెన్స్‌‌‌‌ 3 పొజిషన్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌లో అషి 590 పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచింది. సిఫ్ట్‌‌‌‌ కౌర్‌‌‌‌ సమ్రా (583), అంజుమ్ మౌద్గిల్‌‌‌‌ (581), శ్రీయాంక (575) తర్వాతి స్థాన్లాలో ఉన్నారు.

మెన్స్‌‌‌‌ 3 పొజిషన్స్‌‌లో స్వప్నిల్‌‌‌‌ 592 పాయింట్లతో అగ్రస్థానం సాధించాడు. చైన్‌‌‌‌ సింగ్‌‌‌‌ (591), అఖిల్‌‌‌‌ షెరోన్‌‌‌‌ (589), నీరజ్‌‌‌‌ (579), ప్రతాప్ సింగ్ తోమర్‌‌‌‌ (576) వరుసగా రెండు నుంచి ఐదు ప్లేస్‌‌‌‌ల్లో కొనసాగుతున్నారు.