వాట్సాప్​లోనే కిరాణా ఆర్డర్.. డెలివరీ ఫ్రీ

వాట్సాప్​లోనే కిరాణా ఆర్డర్.. డెలివరీ ఫ్రీ

న్యూఢిల్లీ: కిరాణ సరుకుల బిజినెస్‌‌‌‌‌‌‌‌లో మరింత దూసుకెళ్లడానికి రిలయన్స్‌‌‌‌‌‌‌‌ గ్రూపునకు చెందిన జియోమార్ట్‌‌‌‌‌‌‌‌ మెసేజ్​ యాప్​ వాట్సాప్​తో జట్టుకట్టింది. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ గ్రాసరీలో అమెజాన్‌‌‌‌‌‌‌‌, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌లతో పోటీ పడేందుకు వాట్సప్‌‌‌‌‌‌‌‌ నుంచే కస్టమర్లు ఆర్డర్లు ఇచ్చే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. వాట్సాప్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌లోని  "ట్యాప్ అండ్ చాట్" ఆప్షన్‌‌‌‌‌‌‌‌ను నొక్కి కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేయవచ్చని జియోమార్ట్‌‌‌‌‌‌‌‌ తెలిపింది. అయితే 90 సెకన్ల ట్యుటోరియల్‌‌‌‌‌‌‌‌తో కూడిన ఇన్విటేషన్‌‌‌‌‌‌‌‌ను వాట్సాప్‌‌‌‌‌‌‌‌ ద్వారా అందుకున్న వాళ్లు మాత్రమే కిరాణా సామాన్లకు ఆర్డర్లు ఇవ్వొచ్చు. డెలివరీ ఉచితం.  కనీస ఆర్డర్ పరిమితులు లేవు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, టూత్‌‌‌‌‌‌‌‌పేస్ట్, పనీర్ కాటేజ్ చీజ్, పిండి వంటి సరుకులపై ఆఫర్లు ఉన్నాయని జియోమార్ట్‌‌‌‌‌‌‌‌ తెలిపింది.  చాలా తక్కువ ధరలకు  డేటా, వాయిస్‌‌‌‌‌‌‌‌ సేవలు ఇవ్వడం ద్వారా ఇండియా టెలికమ్యూనికేషన్స్ రంగంలో జియో నంబర్​వన్‌‌‌‌‌‌‌‌గా ఎదిగింది. జియో ధాటికి కొన్ని టెల్కోలు మూతబడ్డాయి. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ షాపింగ్‌‌‌‌‌‌‌‌లోనూ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ ప్లేసును పొందడానికి కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. కిరాణా ప్రొడక్టులపై భారీగా డిస్కౌంట్లు ఇస్తోంది. 

జియోలో ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు

వాట్సాప్‌‌‌‌‌‌‌‌ పేరెంట్‌‌‌‌‌‌‌‌ కంపెనీ ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌ .. రిలయన్స్  జియో ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారాలలో దాదాపు 6 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లను పెట్టిన 19 నెలల తర్వాత తాజా డీల్‌‌‌‌‌‌‌‌ కుదిరింది. దీనివల్ల జియో టెలికం, జియోమార్ట్‌‌‌‌‌‌‌‌.. రెండూ మరింత ప్రజాదరణను పొందుతాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. వాట్సప్‌‌‌‌‌‌‌‌ కూడా తన యూజర్‌‌‌‌‌‌‌‌ బేస్‌‌‌‌‌‌‌‌ను పెంచుకోవచ్చు. రిలయన్స్‌‌‌‌‌‌‌‌ రిటైల్‌‌‌‌‌‌‌‌ స్టోర్ల నుంచే జియోమార్ట్‌‌‌‌‌‌‌‌ కస్టమర్లకు సరుకులు పంపిస్తారు. వాట్సాప్‌‌‌‌‌‌‌‌కు మనదేశంలో 53 కోట్ల మంది యూజర్లున్నారు. ఇండియాలో ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌కు కూడా కోట్ల యూజర్లు ఉన్నారు. జియో కస్టమర్ల సంఖ్య 42.5 కోట్ల వరకు ఉంది.  గూగుల్‌‌‌‌‌‌‌‌ కూడా జియో ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారాలలో గత ఏడాది 4.5 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లు (దాదాపు రూ.38 వేల కోట్లు) ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. 

రిటైల్​ ఖర్చులో సగం కిరాణానే...

రిటైల్‌‌‌‌‌‌‌‌ ఖర్చుల్లో ఆహారం, కిరాణాసామాన్ల వాటాయే 50 శాతానికిపైగా ఉంటుంది. 2025 నాటికి రిటైలింగ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌ విలువ 1.3 లక్షల డాలర్లకు చేరుతుందని బాస్టన్‌‌‌‌‌‌‌‌ కన్సల్టింగ్‌‌‌‌‌‌‌‌ గ్రూపు ప్రకటించింది. ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో మరింత దూసుకెళ్లడానికి అంబానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌ చాలా ప్లాన్లు అమలు చేస్తున్నది. కేవలం రూ.6,500లకు జియో నెక్స్ట్‌‌‌‌‌‌‌‌ పేరుతో స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం గూగుల్‌‌‌‌‌‌‌‌తో చేతులు కలిపింది. స్థానిక చట్టాలను సరిగ్గా అమలు చేయడం లేదని మోడీ ప్రభుత్వం నుంచి విమర్శలు ఎదుర్కొన్న వాట్సాప్‌‌‌‌‌‌‌‌, తన యూజర్‌‌‌‌‌‌‌‌ బేస్‌‌‌‌‌‌‌‌ను పెంచుకోవడానికి రిలయన్స్‌‌‌‌‌‌‌‌ సాయం తీసుకుంటోంది. దేశంలోని 200 సిటీల్లో గ్రాసరీ ఆర్డర్లు తీసుకోవడానికి గత ఏడాదిలో వాట్సాప్‌‌‌‌‌‌‌‌, జియోమార్ట్‌‌‌‌‌‌‌‌ చేతులు కలిపాయి. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ షాపింగ్‌‌‌‌‌‌‌‌ భారీగా అన్ని ప్రాంతాలకూ పాకినప్పటికీ, ఈసెక్టార్‌‌‌‌‌‌‌‌లో మరిన్ని అవకాశాలు ఉన్నాయనే అంచనాతో జియో వాట్సప్‌‌‌‌‌‌‌‌తో డీల్‌‌‌‌‌‌‌‌ కుదుర్చుకుంది. అమెజాన్‌‌‌‌‌‌‌‌, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌తోపాటు గ్రోఫర్స్‌‌‌‌‌‌‌‌, డంజో, స్విగ్గీ, బిగ్‌‌‌‌‌‌‌‌బాస్కెట్‌‌‌‌‌‌‌‌, జెప్టో వంటివి గ్రోసరీ డెలివరీ ఇస్తున్నాయి. జియోమార్ట్‌‌‌‌‌‌‌‌ మాదిరే ఈ కంపెనీలూ భారీ డిస్కౌంట్లను ఆశచూపుతున్నాయి. ఇందుకోసం లోకల్‌‌‌‌‌‌‌‌ కిరాణా స్టోర్లతో కలిసి పనిచేస్తున్నాయి. వీటిలో కొన్ని ఇది వరకే   ఆర్డర్లను తీసుకోవడానికి వాట్సాప్​ను వాడుతున్నాయి.