నవంబర్‌‌‌‌‌‌‌‌లో 5.88 శాతానికి ఇన్‌‌‌‌ఫ్లేషన్

నవంబర్‌‌‌‌‌‌‌‌లో 5.88 శాతానికి ఇన్‌‌‌‌ఫ్లేషన్

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: దేశ ఇన్‌‌‌‌ఫ్లేషన్ (ధరల పెరుగుదల)  నవంబర్‌‌‌‌‌‌‌‌లో 11  నెలల కనిష్టానికి దిగొచ్చింది. గ్లోబల్‌‌‌‌గా క్రూడాయిల్, ఫుడ్‌‌‌‌  ధరలు తగ్గుతుండడంతో ఇన్‌‌‌‌ఫ్లేషన్ కంట్రోల్‌‌‌‌లోకి వస్తోంది. కిందటి నెలలో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్‌‌‌‌ (సీపీఐ)5.88 శాతానికి తగ్గింది. 6.4 శాతంగా రికార్డవుతుందని ఎనలిస్టులు అంచనావేశారు.   అక్టోబర్‌‌‌‌‌‌‌‌–డిసెంబర్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో   ఇన్‌‌‌‌ఫ్లేషన్ 6.6 శాతంగా,  మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో  5.9 శాతంగా నమోదవుతుందని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ తాజా పాలసీ మీటింగ్‌‌‌‌లో అంచనావేసింది.  ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో సగటు ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ 6.3 శాతంగా,  ఏప్రిల్‌‌‌‌–జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 7.3 శాతంగా, జులై–సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 7 శాతంగా రికార్డయ్యింది. కాగా, అక్టోబర్‌‌‌‌‌‌‌‌ నెలలో రిటైల్ ఇన్‌‌‌‌ఫ్లేషన్ 6.77 శాతంగా నమోదయ్యింది.  దేశ ఇన్‌‌‌‌ఫ్లేషన్ 2–6 శాతం మధ్య ఉండేలా చూడాల్సిన బాధ్యత ఆర్‌‌‌‌‌‌‌‌బీఐపై ఉంది. తాజాగా  6 శాతంలోపు రికార్డవ్వడంతో ఈ సెంట్రల్ బ్యాంక్‌‌‌‌కు కొంత రిలీఫ్ దొరుకుతుందని చెప్పొచ్చు.  గత 38 నెలల  నుంచి రిటైల్ ఇన్‌‌‌‌ఫ్లేషన్ 4 శాతానికి పైనే నమోదయ్యింది.  ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌ఫ్లేషన్ 7.80 శాతం వద్ద   గరిష్టాన్ని తాకింది. ఈ లెవెల్‌‌‌‌ నుంచి చూస్తే నవంబర్‌‌‌‌‌‌‌‌లో 192 బేసిస్ పాయింట్లు తగ్గింది. రిటైల్ ఇన్‌‌‌‌ఫ్లేషన్ దిగిరావడానికి ప్రధాన కారణం  ఫుడ్ ఇన్‌‌‌‌ఫ్లేషన్ తగ్గడమే. అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో 7.01 శాతంగా నమోదయిన ఈ సెగ్మెంట్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్లేషన్, నవంబర్‌‌‌‌‌‌‌‌లో 4.67 శాతానికి దిగొచ్చింది. ఫుడ్, ఎనర్జీ వంటి వివిధ సెగ్మెంట్లలో ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకొని మొత్తం ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ను లెక్కిస్తారు. 

ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ చట్టంలో రూల్‌ లేదు..

తాజాగా ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌పై ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఇచ్చిన రిపోర్ట్‌‌‌‌ను బయటకు విడుదల చేయబోమని ప్రభుత్వం పేర్కొంది. వరుసగా మూడు క్వార్టర్లలో అప్పర్‌‌‌‌‌‌‌‌ లిమిట్‌‌‌‌ అయిన 6 శాతానికి పైనే ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ నమోదు అయ్యింది. 
దీనికి గల కారణాలను తెలియజేస్తూ  కిందటి నెల ప్రారంభంలో  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ప్రభుత్వానికి రిపోర్ట్ చేసింది. రూల్స్‌‌‌‌కు తగ్గట్టు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ తన రిపోర్ట్‌‌‌‌ను ప్రభుత్వానికి సబ్మిట్ చేసిందని ఫైనాన్స్ మినిస్ట్రీ సహాయ మంత్రి పంకజ్‌‌‌‌ చౌదరి లోకసభలో పేర్కొన్నారు. ఈ రిపోర్ట్‌‌‌‌ను పబ్లిక్‌‌‌‌కు విడుదల చేయాలనే ప్రొవిజన్స్‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ చట్టం, 1934 లో లేదని గుర్తు చేశారు. ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ను కంట్రోల్ చేయడంలో ఫెయిలైనందుకు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ  ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారి. 2016 లో ఈ రూల్‌ తెచ్చారు.

ట్యాక్స్ కలెక్షన్‌‌‌‌ సూపర్..

నికర డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు ఏప్రిల్‌‌‌‌–నవంబర్‌‌‌‌‌‌‌‌లో  24 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను వేసుకున్న బడ్జెట్ అంచనాల్లో 61.79 శాతానికి చేరుకున్నామని ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొంది. డైరెక్ట్ ట్యాక్స్ కింద ఏప్రిల్‌‌‌‌–నవంబర్‌‌‌‌‌‌‌‌లో నికరంగా  రూ.8.77 లక్షల కోట్లు వసూళ్లయ్యాయని  ప్రకటించింది. కిందటేడాది ఇదే టైమ్‌‌‌‌లో సేకరించిన నెట్‌‌‌‌ డైరెక్ట్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌తో పోలిస్తే ఇది 24.26 శాతం ఎక్కువని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు రూ.14.20 లక్షల కోట్లుగా ఉంటాయని బడ్జెట్‌‌‌‌లో అంచనావేశారు. ఇండివిడ్యువల్‌‌‌‌, కార్పొరేట్  ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ డైరెక్ట్ ట్యాక్స్ కిందకు వస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌–నవంబర్ మధ్య రూ.2.15 లక్షల కోట్లను రిఫండ్ చేశామని ఫైనాన్స్ మినిస్ట్రీ వెల్లడించింది.