
గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఎగువ నుంచి 98 వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 12 గేట్లు ఎత్తి 74,052 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి కోసం 27,384 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిప్ట్‌కు 315, రైట్ కెనాల్‌కు 290, లెఫ్ట్ కెనాల్‌కు 550, బీమా లిఫ్ట్-1కు 650, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 315, ఆర్‌డీఎస్ లింక్ కెనాల్‌కు 150 క్యూసెక్కులతో కలిసి మొత్తం 1,03,284 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.