దినేష్ తేజ్, దష్విక జంటగా అర్జున్ కోల దర్శకత్వంలో వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటి నిర్మిస్తున్న చిత్రం ‘తత్వం’. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇదొక మంచి ఎమోషనల్ కనెక్టవిటి ఉన్న థ్రిల్లర్. అనుకున్న కథను మించి దర్శకుడు తెరకెక్కించాడు. అందరికీ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా’ అని అన్నారు.
దర్శకుడు అర్జున్ కోలా మాట్లాడుతూ ‘సంగీతానికి ప్రాధ్యాన్యమున్న చిత్రమిది. చేతన్ భరద్వాజ్ కథకు తగ్గట్టుగా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. మన చుట్టు జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించాం. ఇందులో ఉండే ట్విస్ట్‌లు ఆడియన్స్‌కు షాకింగ్‌గా ఉంటాయి. తప్పకుండా అందర్నీ ఎంగేజ్ చేస్తుంది’ అని చెప్పాడు.
