అన్ని బాధ్యతలు వదిలేస్తా.. ఇన్‌ఫ్లుయెన్సర్‌‌గా మారతా

అన్ని బాధ్యతలు వదిలేస్తా.. ఇన్‌ఫ్లుయెన్సర్‌‌గా మారతా

ఎలన్ మస్క్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన మస్క్.. వ్యాపారంతోపాటు క్రేజీ చేష్టలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు. టెస్లా సీఈవో, స్పేస్ ఎక్స్ అధినేత అయిన మస్క్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మస్క్ చేసిన తాజా ట్వీట్ ఆయన ఫ్యాన్స్ ను ఒకింత ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేస్తోంది. తాను చేస్తున్న పనులన్నింటినీ వదిలేసి.. ఇన్ ఫ్లుయెన్సర్ గా మారిపోవాలని భావిస్తున్నట్లు ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ పై ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 

ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే.. ‘నా ఉద్యోగాల నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నా. ఫుల్ టైమ్ ఇన్ ఫ్లుయెన్సర్ గా మారాలనుకుంటున్నా’ అని మస్క్ ట్వీట్ చేశాడు. మస్క్ నిజంగానే తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడా అనేది తెలియదు. అలాగని ఆయన జోక్ చేశాడనీ చెప్పలేం. చెప్పిందే చేస్తాడనే మస్క్ కు పేరుంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన తాజా ట్వీట్ కార్పొరేట్ రంగంలో హాట్ టాపిక్ గా మారింది. 

నెటిజన్ల ఫన్నీ రెస్పాన్స్

మీరు నిజంగా ఇన్ ఫ్లుయెన్షియర్ గా మారితే.. తాను ఫస్ట్ సబ్ స్క్రైబర్ గా మారతానని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మీరు ఇన్ ఫ్లుయెన్షియర్ అయితే యూట్యూబ్ వ్యూస్ ఎలా సంపాదించుకోవాలో చెబుతా అంటూ మరో నెటిజన్ సరదా కామెంట్ పెట్టాడు.