విద్యార్థులకు చదువుతోపాటు క్రమశిక్షణ అవసరం : తీగల భరత్ గౌడ్

విద్యార్థులకు చదువుతోపాటు క్రమశిక్షణ అవసరం : తీగల భరత్ గౌడ్

హసన్ పర్తి, వెలుగు: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కేవలం చదువే కాకుండా క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసం అవసరమని ఇన్​స్పయిర్​కళాశాల​ చైర్మన్ తీగల భరత్ గౌడ్ అన్నారు. బుధవారం ఇన్​స్పెయిర్​జూనియర్ కళాశాల హస్టా లా విష్ట 2కే 19 వీడ్కోలు సమావేశం హనుమకొండ జిల్లా చింతగట్టు ఎంటీఆర్ గార్డెన్ లో నిర్వహించారు.

కార్యక్రమానికి కళాశాల చైర్మన్​ తీగల భరత్ గౌడ్ హాజరై మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్య సాధన దిశగా నిరంతరం కృషి చేస్తూ, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తే తప్పకుండా విజయం సాధించగలరని సూచించారు. కార్యక్రమంలో కాలేజ్​ ప్రిన్సిపాల్ సుంకరి శ్రీరాం రెడ్డి, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.