రేపటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

రేపటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

 ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది ఇంటర్ బోర్డు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 3,27,761 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు. హాల్‌టికెట్లను కాలేజీ యాజమాన్యం నుంచి తీసుకోవాలని చెప్పారు.

ఇందులో MPC నుంచి 1,59,429 మంది,BPC నుంచి 89,496 మంది, జాగ్రఫీ నుంచి 261 మంది, ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ నుంచి 42,649 మంది, సెకండ్ ఇయర్ నుంచి నుంచి 35,926 మంది విద్యార్థులు ఉన్నారు. నాలుగు విడుతలుగా జరిగే ప్రాక్టికల్స్‌కు ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల, ప్రైవేటు జూనియర్ కాలేజీలు కలిపి మొత్తం 1,733 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు ఇంటర్‌ బోర్డు సెక్రటరీ ఏ అశోక్ తెలిపారు. ఎగ్జామినర్లుగా 6,314 మంది జూనియర్ లెక్చరర్లను ఎంపిక చేశామన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఉన్నతస్థాయి కమిటీ, జిల్లా పరీక్షల కమిటీలు పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తాయని చెప్పారు. హాల్‌టికెట్లు అందని వారు bie.telangana.gov.in ద్వారా తీసుకోవాలన్నారు.

ప్రాక్టికల్ పరీక్షల కోసం ఆన్‌లైన్ ద్వారా క్వశ్చన్ పేపర్ డౌన్‌లోడ్ చేసుకొనే విధానాన్ని గతంలోనే తీసుకొచ్చారని, దానినే ఇప్పుడు కూడా కొనసాగిస్తామని బోర్డు సెక్రటరీ తెలిపారు. పరీక్షల ప్రారంభానికి అరగంట ముందే యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్, వన్ టైం పాస్‌ వర్డ్ సహాయంతో కాలేజీ ప్రిన్సిపాల్ ప్రశ్నపత్రం డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షల ఆన్సన్ షీట్స్ ను అదేరోజు వ్యాల్యూషన్ చేసి, వేసిన మార్కులను తిరిగి అదేరోజు బోర్డు వెబ్‌సైట్‌కు అప్‌లోడ్ చేయాల్సి ఉందన్నారు.