ఐఐటీలో సీటు రాదేమోనని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ఐఐటీలో సీటు రాదేమోనని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

రాష్ట్రంలో మరో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  తనకు ఐఐటీలో ర్యాంకు వస్తుందో రాదో అన్న భయంతో 22 ఏళ్ల సోహెల్.. గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేసిన సోహెల్ ఐఐటీలో కోచింగ్ తీసుకొని ప్రవేశ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఐఐటీ రిజల్ట్స్ ప్రకటించనున్న క్రమంలో ఐఐటీలో సీటు రాదేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

నేరేడ్‌మెట్‌లోని బాలాజీనగర్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సోహెల్ తండ్రి  ఆర్మీ జవాను గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. ఇంటర్ లో కూడా కొన్ని సబ్జెక్టులు తప్పిన సోహెల్ ను గత రాత్రి  తండ్రి తీవ్రంగా మందలించాడు. దీంతో మానసిక క్షోభకు గురైన  సోహెల్..   తండ్రి సర్వీస్ గన్ తో తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని సోహెల్ తండ్రిని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు