ఇంటర్ పరీక్షలో ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్య 

ఇంటర్ పరీక్షలో ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్య 

ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో చోటు చేసుకుంది. వివారాల్లోకి వెళ్లితే.. మే 9వ తేదీ మంగళవారం తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రి నగర్ కు చెందిన ప్రజ్వల్ అనే విద్యార్థి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాయగా.. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు.

దీంతో ఆ విద్యార్థి మనస్తామనికి గురైన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రజ్వల్ హైదరాబాద్ మాదాపూర్ లో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. ప్రజ్వల్ మృతితో కుటుంబంలో విషాదచాయలు అలముకొన్నాయి.