ఇంటర్నేషనల్‌‌‌‌ బైకర్‌‌‌‌ రితీశ్ రెడ్డికి రోడ్ ప్రమాదం.. నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలో ఘటన

ఇంటర్నేషనల్‌‌‌‌ బైకర్‌‌‌‌ రితీశ్ రెడ్డికి రోడ్ ప్రమాదం.. నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలో ఘటన

జూబ్లీహిల్స్‌‌‌‌, వెలుగు: పెన్నా సిమెంట్ సంస్థకు చెందిన ప్రముఖ వ్యాపారి, ఇంటర్నేషనల్​ బైక్​రైడర్​ రితీష్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఏపీలో హార్లీ-డేవిడ్సన్ మోటార్స్‌‌‌‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు రితీశ్​రెడ్డి తన బీఎండబ్ల్యూ బైక్‌‌‌‌పై వెళ్లారు. ఆదివారం అదే బైక్​పై బాపట్ల నుంచి హైదరాబాద్‌‌‌‌కు తిరిగి వస్తుండగా, నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో అర్ధరాత్రి సమయంలో ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు పక్కన రితీశ్​రెడ్డి మృతదేహం, బైక్‌‌‌‌ పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు బంజారాహిల్స్‌‌‌‌ వాసిగా గుర్తించి కుటుంబ సభ్యులకు అందించారు.