రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సర్వర్ డౌన్ కావడంతో రిజస్ట్రేషన్ సేవలకు ఆటంకం కలిగింది. చాలా మంది రిజస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కో రిజస్ట్రేషన్ కు గంటల కొద్ది టైమ్ పడుతుండటంతో స్లాట్ బుక్ చేసుకున్న వారికి తిప్పలు తప్పడం లేదు. అయితే టెక్నికల్ సమస్య వల్లే ఈ ఆటంకం ఏర్పడిందని అధికారులు అంటున్నారు. కాగా గత రెండు మూడు రోజులుగా తరుచుగా సర్వర్ డౌన్ లు సమస్యలు తలేత్తుతున్నాయి.
