బెంగళూరు దగ్గర ఫాక్స్‌‌‌‌‌‌‌‌కాన్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌?

బెంగళూరు దగ్గర ఫాక్స్‌‌‌‌‌‌‌‌కాన్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌?

న్యూఢిల్లీ: యాపిల్ ఫోన్ల తయారీ కంపెనీ ఫాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాన్‌‌‌‌‌‌‌‌ చైనా నుంచి తమ మాన్యుఫాక్చరింగ్ బేస్‌‌‌‌‌‌‌‌ను ఇండియాకు షిఫ్ట్ చేస్తోంది. ఇప్పటికే   ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌, తమిళనాడులో ప్లాంట్లను ఏర్పాటు చేసిన ఈ కంపెనీ, తాజాగా తెలంగాణలో కూడా ఒక ప్లాంట్ పెడతామని ప్రకటించింది. మరోవైపు బెంగళూరు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌కు సమీపంలో 700 మిలియన్ డాలర్ల (రూ.5,700 కోట్ల) తో ఒక మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను పెట్టాలని చూస్తోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.  మొత్తం  300 ఎకరాల్లో ఈ   ప్లాంట్ ఏర్పాటవుతుందని అన్నారు. ఇక్కడ యాపిల్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను తయారు  చేయడంతో పాటు ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ కోసం పార్టులను కూడా తయారు చేస్తారని వివరించారు. ఫాక్స్‌‌‌‌‌‌‌‌కాన్ ఇప్పటి వరకు ఇండియాలో పెట్టిన ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లలో ఇదే అతిపెద్దది కానుందని అన్నారు.  చైనీస్ గవర్నమెంట్ జీరో కొవిడ్ పాలసీ తీసుకురావడం, ఇతర చర్యలతో యూఎస్ టెక్ కంపెనీ యాపిల్ విసిగిపోయింది.

పూర్తిగా చైనాపై ఆధారపడకుండా ఉండేందుకు  ఇండియా వంటి ఆల్టర్నేటివ్  డెస్టినేషన్ల కోసం చూస్తోంది. కంపెనీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్లు  ఇండియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల వైపు చూడడం పెంచారు.  బెంగళూరు దగ్గర ఏర్పాటు చేసే  ప్లాంట్‌‌‌‌‌‌‌‌తో లక్ష ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు. కాగా, ఈ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఫాక్స్‌‌‌‌‌‌‌‌కాన్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. చైనా నుంచి ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ను షిఫ్ట్ చేస్తుందా? అనే అంశంపై  క్లారిటీ లేదు. విస్ట్రాన్‌‌‌‌‌‌‌‌, పెగట్రాన్ వంటి  ఇతర యాపిల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్లు కూడా ఇండియాలో తమ  ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ను పెంచుతున్నాయి. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాడ్స్‌‌‌‌‌‌‌‌కు కాంపోనెంట్స్ అందించే జబిల్‌‌‌‌‌‌‌‌ ఐఎన్‌‌‌‌‌‌‌‌సీ కూడా ఇండియాలో తమ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్ చేసింది.