హెట్‌మైర్‌ మెరుపులు.. రాజస్తాన్‌ రాయల్స్‌ టార్గెట్-166

హెట్‌మైర్‌ మెరుపులు.. రాజస్తాన్‌ రాయల్స్‌ టార్గెట్-166

లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. షిమ్రోన్‌ హెట్‌మైర్‌ 36 బంతుల్లో  ఒక ఫోర్‌, ఆరు సిక్సర్లతో 59 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. దేవదత్‌ పడిక్కల్‌ 29 పరుగులు చేయగా.. అశ్విన్‌ 28 పరుగుల వద్ద రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. లక్నో బౌలర్లలో జాసన్‌ హోల్డర్‌, కృష్ణప్ప గౌతమ్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. ఆవేశ్‌ ఖాన్‌ ఒక వికెట్‌ తీశాడు.